వాట్సాప్ 2015లో వెబ్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, డెస్క్‌టాప్‌పై వాట్సాప్ పనిచేయాలంటే తప్పనిసరిగా మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కావాల్సిందే. అయితే, ఇప్పుడా అవసరం లేకుండా  డెస్క్‌టాప్‌పైనే పనిచేసేలా ‘యూనివర్సల్ విండోస్ ప్లాట్‌ఫాం’(యూడబ్ల్యూపీ) యాప్‌ను సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మన ఫోన్ ఆన్లో ఉన్నా, ఆఫ్‌లో ఉన్నా డెస్క్‌టాప్ వెర్షన్ ద్వారా పనిచేసుకోవచ్చని లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇవేకాక పలు రకాల అనుకూలతలు ఈ కొత్త యాపులో ఉన్నట్టు సమాచారం.