యాక్సిడెంటులో మృతి చెందిన వారిలో  రేప్ సాక్షి మృతి ...

రేప్ బాధితురాలి కండిషన్ సీరియస్... 

బి‌జే‌పి ఎం‌ఎల్‌ఏ కుల్దీప్ సెంగర్ మీద హత్యాయత్నం కేసు నమోదు...

లక్నో: ఏ ప్రభుత్వం వచ్చినా,  పోయినా సామాన్య ప్రజలు గౌరవంగా, వారి మానాన వారు బ్రతకటం అసాధ్యం అని ఇంకొకసారి రుజువైయ్యింది. రెండు సంవత్సరాలకు ముందు రేప్ కేసు బాధితురాలు, అదే కేసులో  సాక్షిగా ఉన్న తన బంధువులతో కలసి ఉన్నావ్ నుండి రాయ్ బరేలి వెళుతుండగా నిన్న వేగంగా వచ్చిన ఒక ట్రక్కు వారి వాహనాన్ని ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, వారిలో ఒకరు బి‌జే‌పి ఎం‌ఎల్‌ఏ కుల్దీప్ సెంగర్ తనని బలాత్కరించినట్టు ఆరోపించిన కేసులో సాక్షి. బాధితురాలు తీవ్రంగా గాయపడి,  సీరియస్ కండిషన్లో ఉన్నట్లు తెలుస్తుంది. 

కూతురు కోసం పోరాటం చేసిన తండ్రి హత్య 

కొంతకాలం క్రితం కూతురి రేప్ కేసు విషయమై తీవ్రంగా పోరాటం చేసిన ఆమె తండ్రి కూడా హత్యకు గురయ్యాడు. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడంటూ ఆమె తండ్రి మీద కాసే పెట్టి అరెస్టు కూడా చేశారు. ఆయన పోలీసు కస్టడీలో ఉన్నప్పుడే మరణించాడు.   ఆ కేసులో కూడా ముద్దాయి, బి‌జే‌పి ఎం‌ఎల్‌ఏ కుల్దీప్ సెంగర్ సోదరుడే. దేశమంతా సంచలనం రేపిన ఈ కేసులో కుల్దీప్ సెంగర్ ఒక సంవత్సరం జైలులో గడప వలసి వచ్చింది. ఈ విషయం పార్లమెంటులో ప్రకంపనలని సృస్టించింది.