15 మందికి గాయాలు, మృతుల్లో 6 ఏళ్ల బాలుడు


గిల్రాయి:   ఉత్తర కాలిఫోర్నియాలోని గిల్రాయి గార్లిక్ ఫెస్టివల్ జరుగుతుండగా ఒక ఉన్మాది విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో  ముగ్గురు దుర్మరణం చెందగా పదిహేనుమంది గాయాల పాలయ్యారు. మృతుల్లో 6 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. అందరూ ఆదివారం ఉత్సవ సంబరాల్లో ఉండగా  సాయంత్రం 5.41 గంటలకు, కంచె కట్ చేసుకొని, లోపలికి ప్రవేశించిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్టు పోలీస్ చీఫ్ స్కాట్ స్మిత్ ఈ తెలియచేసారు. కాల్పులు మొదలు పెట్టిన ఒక నిముషంలోనే పోలీసులు స్పందించి ఆ కాల్పులు జరిపిన వ్యక్తిని కాల్చి చంపినట్టు ఆయన చెప్పారు. అయితే ఆ కాల్పుల్లో రెండవ వ్యక్తి కూడా ఉన్నట్టు, వాళ్ళు పోలీస్ దుస్తులు ధరించినట్టు ప్రత్యక్ష సాక్షులు తెల్పారు.