సారథిగా విరాట్ కోహ్లిని ఎలా నియమిస్తారు?


ముంబయి: బీసీసీఐ సెలక్షన్‌ కమిటీకీ దమ్ములేదని,   అసలు సమీక్ష చేయకుండానే సారథిగా విరాట్‌ కోహ్లీని తిరిగి ఎలా నియమిస్తారని దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ తీవ్ర విమర్శలు చేశారు ఇష్టమొచ్చినట్టు తన సొంతానికి కోహ్లీ జట్టును ఎంపిక చేస్తాడా అని కఠినంగా మాట్లాడారు. ఈ సెలక్షన్‌ కమిటీకి ఇదే చివరి ఎంపిక అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం.

    అంచనాలను తగినట్టు ఆడలేదని జాదవ్‌, కార్తీక్‌లాంటి ఆటగాళ్లను పక్కనపెట్టారు. మరి టీమిండియాను కనీసం  చేర్చ ఫైనల్సుకి చేర్చలేని సారథిని కొనసాగించారు.  మీరు ఏం సందేశం ఇస్తున్నారు?’ అని గావస్కర్‌ ప్రశ్నించారు.

 కనీసం సారథ్యం గురించి సమావేశం నిర్వహించకుండా అతడి సారథిగా ఎంపిక చేయడం సమంజసమా అని ప్రశ్నించారు.  సారథిని తిరిగి ఎంపిక చేసేందుకు సెలక్టర్లు కనీసం ఐదు నిమిషాలైనా కేటాయించలేదు’ అని సన్నీ విమర్శించారు.

‘ఈ సెలక్షన్‌ కమిటీకి బహుశా ఇదే చివరి ఎంపిక కావొచ్చు అని, కనీసం కొత్త 
 కమిటీకైనా జట్టు యజమాన్యాన్ని ప్రశ్నించగలిగే ధైర్యం ఉంటుందనుకుంటున్నానని గవాస్కర్ అన్నారు.