వాషింగ్టన్‌ : 5జీ మార్కెట్టులో యాపిల్ కంపెనీ మిగతా పోటీ దారులకన్నా వెనక బడటంతో, పోటీని తట్టుకోవటానికి కొత్త 5జీ ఫోన్లను ప్రపంచ మార్కెట్లలో వచ్చే సంవత్సరం విడుదల చేయ నున్నట్లు సమాచారం.  టెక్‌ దిగ్గజం యాపిల్‌ వచ్చే ఏడాది మూడు ఫోన్లను ఆవిష్కరించనుంది . 5జీ విషయంలో హువావే, శాంసంగ్‌ల కంటే యాపిల్‌ కాస్త వెనుకబడి ఉన్నట్లు కనిపించినప్పటికీ.. 2020లో ఆవిష్కరించే మూడు ఐఫోన్లు 5జీ సౌకర్యంతో వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రముఖ విశ్లేషకుడు మింగ్‌-చీ క్యో తెలిపారు

యాపిల్ ఇంటెల్‌ స్మార్ట్‌ఫోన్‌ మోడమ్‌ బిజినెస్‌ను నుంచి ప్రయోజనాలు పొందాలని చూస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే 5జీ ఫోన్ల తయారీపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పైగా ఆగ్మెంటెడ్‌ రియాల్టీ ఉత్పత్తులు, సేవలకు 5జీ ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉందని మింగ్‌-చీ తెలిపారు.

2020లో విడుదల చేసే ఐఫోన్లలో 5జీతో పాటు OLED ఫీచర్లు ఉండనున్నాయి. 6.7,6.1, 5.4 అంగుళాలతో ఫోన్లు రాబోతున్నట్టు సమాచారం.