ర్యాంపుల్లో వీడియో కెమెరాలు ...
భవన కార్మికుల ధర్నా నేపధ్యంలో నిర్ణయం 

ఆమరావతి: ఏపీలో ఇసుక కొరతపై సీఎం జగన్ మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం నాడు ‘స్పందన’ కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి జగన్.. పలు సలహాలు, సూచనలు చేశారు.  ఇసుక కొరతపై సుమారు అరగంటపాటు చర్చించినట్లు తెలిసింది. ఇసుక కొరత తీవ్రరూపం దాల్చడంతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కి.. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి తరలివచ్చి విజయవాడ ధర్నా చౌక్‌లో ఆందోళన నిర్వహించిన నేపధ్యంలో  

సెప్టెంబరు నుంచి కొత్త పాలసీ అమల్లోకి వస్తుంది. అన్ని ర్యాంపుల్లో వీడియో కెమెరాలు ఉంటాయి. పారదర్శకంగా విధానం ఉంటుంది. ఇసుక ఎక్కడా కొరత లేకుండాచూడటానికి అవసరమైతే ర్యాంపులు తెరిచి వాటి సంఖ్య పెంచుతారు.  అదే సమయంలో అవినీతి లేకుండా చూసుకూమని,  ఇసుక లభ్యత లేకపోతే రేటు పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడతారని, ఇసుక సమస్యపై కచ్చితంగా దృష్టి పెట్టమని అని కలెక్టర్లు, ఎస్పీలకు వైఎస్ జగన్ ఆదేశించారు.