జాన్వీ, ఇషాన్ మంచి స్నేహితులు వారి స్నేహాన్ని నేను గౌరవిస్తాను - బోనీకపూర్

 శ్రీదేవి, బోనీకపూర్‌ల పెద్ద కుమార్తె జాన్వీ కపూర్, నటుడు ఇషాన్ ఖత్తర్‌తో ప్రేమ వ్యవహారం గురించి  సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. ఇంతకు ముందు వారిద్దరు `దఢక్` చిత్రంలో నటించారు. త్వరలోనే మరో చిత్రంలో కూడా కలిసి నటించబోతున్నారని వార్తలు కూడా వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య తొలి సినిమాతో ఏర్పడ్డ స్నేహం కాస్త ప్రేమగా మారిందని, అందుకే ఇద్దరూ కలిసి ఫంక్షన్స్‌కు, డిన్నర్స్‌కు వెళుతున్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఏ విషయంపై  జాన్వీ తండ్రి బోనీ కపూర్ తన కుమార్తెపై గౌరవం ఉందని,  జాన్వీ, ఇషాన్ మంచి స్నేహితులని, వారి స్నేహాన్ని  గౌరవిస్తానని అన్నారు.