విజయవాడ: తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3 ప్రసారాలు నిలిపివేయాలని, సెన్సార్ చేసిన తర్వాతే ప్రసారం చేయాలని దర్శకనిర్మాత, తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి విజయవాడలోని ధర్నా చౌక్‌లో కేతిరెడ్డి ధర్నా చేపట్టారు. ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో పిటిషన్ సైతం వేయడం జరిగింది. ఆ తర్వాత బిగ్‌బాస్ కంటెస్టెంట్లగా ఎంపిక చేసి హౌస్‌లోకి తీసుకోలేదని ఆరోపించిన యాంకర్ శ్వేతారెడ్డి, నటి గాయత్రీ గుప్తాతో కలిసి ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు దిగారు. అనేక వివాదాల నడుమ,  అనుకున్నట్లుగానే జులై-23 ఆదివారం సాయంత్రం బిగ్‌బాస్ షో మొదలైయ్యింది. అయినప్పటికీ కేతిరెడ్డి మాత్రం తన పోరాటం ఆపలేదు. ఇప్పుడు,  విజయవాడలోని ధర్నా చౌక్‌లో కేతిరెడ్డి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ‘అన్నమయ్య’, ‘షిరిడిసాయి’ లాంటి సినిమాల్లో నటించిన నాగార్జున ఇలాంటి షోలు చేయడం ఎంత వరకు సమంజసం..? అంటూ ప్రశ్నించారు. బిగ్‌బాస్ షోను బ్యాన్ చేసేవరకూ దేశ వ్యాప్తంగా నిరసలు చేపడతామని, ఎట్టి పరిస్థితులలోనూ తమ పోరాటం ఆగదని " అని కేతి రెడ్డి అన్నారు.