భోపాల్: అక్క భర్తపై మోజుతో అతి కిరాతకంగా అక్క ప్రాణాలు ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ జిల్లా కైత్రాలో జూలై 27న ఈ దారుణం జరిగింది. ఎలాగైనా బావను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది. అడ్డుగా ఉన్న అక్కను ఎలాగైనా తప్పించాలనుకుంది. ఈ వికృతపు ఆలోచనే ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అక్క గర్భవతన్న  కనికరం లేకుండా కత్తితో పలుమార్లు పొడిచి హతమార్చింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ జిల్లా కైత్రాలో జూలై 27న జరిగిందీ దారుణ సంఘటన.

అభిలాష(27)కి కొద్ది నెలల క్రితం పెళ్లైంది. షతక్షి (19) అక్కాచెల్లెళ్లు. ఆమె గర్భవతి కావడంతో అమ్మనాన్నలతో పాటే ఉంటోంది. అయితే ఆమె భర్తపై షతక్షి వ్యామోహం పెంచుకుంది. ఎలాగైనా అతడిని పొందాలనుకుంది. దీనికోసం భాగంగా వాష్‌రూంలో ఉన్న అక్కపై కత్తితో దాడి చేసింది. మెడపై కడుపులోకర్కశంగా పొడిచింది. బాధితురాలి అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకొని తీవ్ర గాయాలపాలైన అభిలాషను ఆసుపత్రికి చేర్చారు. అయితే అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె మరణించింది . ఘటనా స్థలం నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన నిందితురాలిని స్థాంకులు  పట్టుకొని పోలీసులకు అప్పగించారు. శుక్రవారం రాత్రి, శనివారం రాత్రి రెండు సార్లు ప్రయత్నించి విఫలమైనట్లు మూడోసారి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.