యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడుగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ యాక్షన్ థ్రిల్లర్ `సాహో`. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక సినిమా యూనిట్ మొత్తం ప్రమోషన్ మొదలపెట్టనుండి. సినిమా ప్రమోషన్స్ అంటే అంతగా పాల్గొనని ప్రభాస్  ఈసారి పంథా మార్చుకొని  పెద్ద  ఎత్తున ప్రమోషన్స్‌లో పాల్గొనబోతున్నడని సమాచారారం. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. కాబట్టి జాతీయ స్థాయిలో ప్రభాస్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. 
 
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్, నీల్ నితిన్, చంకీ పాండే, మందిరాబేడి, జాకీ ష్రాఫ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. `బాహుబలి` తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ అంచనాల నడుమ ఆగస్ట్ 30న సినిమాను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.