వాన్‌పిక్ వ్యవహారంపై  ఇంటర్‌పోల్‌కు ఫిర్యాదు చేసిన రస్ అల్ ఖైమా
విడిపించమని వైసిపి ఎం‌పిల లేఖ!

సెర్బియా : ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌‌ను వాన్‌పిక్ వ్యవహారంపై సెర్బియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రస్ అల్ ఖైమాకు కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతో బెల్‌గ్రేడ్‌లో నిమ్మగడ్డను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.  రస్‌ అల్‌ ఖైమాకు కొత్త  సీఈవో రావడంతో వాటాల వ్యవహారంపై తక్షణం చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఆయన ఫిర్యాదుతోతోనే ఇంటర్‌పోల్‌ రంగంలోకి దిగింది. రెండ్రోజుల క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకోగా ఈ ఘటనకు ఆలస్యంగా వెలుగు చూసింది.
 
సెర్బియా విహారయాత్రకు వెళ్ళిన నిమ్మగడ్డ ప్రసాదును  అక్కడే  పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది.  నిమ్మగడ్డకు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డితో మంచి సంబంధాలున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో,  నిమ్మగడ్డను భారత్‌కు తీసుకువచ్చేందుకు సెర్బియాతో సంప్రదింపులు జరపాలంటూ విదేశాంగమంత్రి జైశంకర్‌కు వైసీపీ ఎంపీలు చర్చనీయాంశమైన లేఖ రాశారు. నిమ్మగడ్డను అరెస్ట్ చేయకుండా సురక్షితంగా ఇండియాకు పంపించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో ఎంపీలు కోరారు.