రానున్న ఎన్నికలలో బి‌జే‌పిదే అధికారం...

ఖమ్మం: పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బి‌జే‌పి ప్రభుత్వ విధానాలు నచ్చి చాలా పార్టీలో చేరేందుకు వివిధ పార్టీలకు చెందిన చాలా మంది ముఖ్య నేతలు సిద్ధంగా ఉన్నారని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన నూతన అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మాణాలకు బీజేపీ పూర్తి వ్యతిరేకం అని దత్తాత్రేయ తెలిపారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కొత్త నిర్మాణాలు కాదు, రైతులకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేని దివాళా తీసిన పార్టీ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీని మరింత బలోపేతం చేస్తామన్నారు.  రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీదే అధికారం అని దత్తాత్రేయ అన్నారు.