న్యూఢిల్లీ: 2017లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో పాక్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన పాకిస్థాన్ యువ పేసర్ హసన్ అలీ (25) భారత అమ్మాయిని పెళ్లాడబోతున్నాడు. హసన్ ఇప్పటి వరకు 9 టెస్టులు, 53 వన్డేలు ఆడాడు. హసన్ అలీ   హరియాణాకు చెందిన షమియా అర్జూను దుబాయ్‌లో ఆగస్టు 20న అలీ వివాహం చేసుకోబోతున్నట్టు పాకిస్థాన్‌కు చెందిన ‘జియో న్యూస్’ పేర్కొంది. హరియాణాకు చెందిన షమియా ఓ ప్రైవేటు విమానయాన సంస్థలో పనిచేస్తున్న షమియా కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్‌లో నివసిస్తోంది. దుబాయ్‌లోని ఓ స్నేహితుడి ద్వారా షమియాతో హసన్ అలీకి పరిచయం అయింది. అయితే  పెళ్లి ఇంకా నిశ్చయం కాలేదని, ఇరు కుటుంబాల పెద్దలు కలుసుకుని పెళ్లి విషయాన్ని నిర్ణయిస్తారని మంగళవారం సాయంత్రం ట్వీట్ చేశాడు.