భారత సీఈఓలలో ముకేశ్‌ మొదటి స్థానం - ప్రపంచ టాప్‌ సీఈఓల్లో 49వ స్థానం 

న్యూఢిల్లీ: ప్రపంచంలోని అత్యంత ప్రభావశీల సీఈఓల  జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీకి చోటు దక్కింది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) చైర్మన్‌ సంజీవ్‌ సింగ్‌, ఓఎన్‌జీసీ సీఎండీ శశి శంకర్‌కూ స్థానం లభించింది. ఈ ఏడాదికి గాను సీఈఓ వరల్డ్‌ మ్యాగజైన్‌ విడుదల చేసిన లిస్ట్‌లో మొత్తం 10 భారత కంపెనీల సారథులు స్థానం సంపాదించుకున్నారు. లగ్జెంబర్గ్‌ కంపెనీ ఆర్సెలార్‌ మిట్టల్‌ చైర్మన్‌, సీఈఓ లక్ష్మీ మిట్టల్‌ 3వ స్థానంలో ఉన్నారు.  ప్రపంచ టాప్‌ సీఈఓల జాబితాలో వాల్‌మార్ట్‌ సారథి మెక్‌మిల్లన్‌కు అగ్రస్థానం దక్కగా రాయల్‌ డచ్‌ షెల్‌ గ్లోబల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ బెన్‌ వాన్‌ బ్యూర్డెన్‌ రెండో స్థానంలో నిలిచారు.