పోలీస్ స్టేషన్ బదులు పోర్న్‌సైట్‌లో ప్రత్యక్షం!

న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో ఓ జంట కామ కలాపాలకు    పాల్పడింది. సీసీ టీవీ కెమెరాలో రికార్డైన ఆ దృశ్యాలను చూసిన అధికారులు నిర్ఘాంతపోయారు. 
వెంటనే అజాద్‌పూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ కోసం ఆ ఫుటేజీలను రైల్వే స్టేషన్ అధికారులు పోలీసులకు అందజేశారు. అయితే, తాజాగా పోలీస్ స్టేషన్‌లో ఉండాల్సిన ఆ వీడియోలు  పోర్న్ సైట్‌లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో మెట్రో అధికారులు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసుల సంరక్షణలో ఉండాల్సిన ఫుటేజీ బయటకు ఎలా వచ్చిందన్నసందేహాలు తలెత్తుతున్నాయి. మెట్రో రైల్వేకు సంబంధించిన వ్యక్తి ఎవరో ముందే ఆ వీడియోను దొంగిలించి పోర్న్ సైట్‌లో అప్‌లోడ్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.  ఆ దృశ్యాలను  పోర్న్ సైట్‌లో పెట్టిన వ్యక్తిని గుర్తించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.