స్వస్థలం చీకనహళ్లికిలో అంత్యక్రియలు...
రాజ్యసభలో వాయిదా తీర్మానం 

బెంగళూరు: 36 గంటల నిరంతరం వందలమంది  శ్రమించిన తరువాత, కేఫ్ కాఫీ డే అధినేత  వి‌జి సిద్ధార్థ్ మృత దేహం నేత్రావతి నదిలో లభ్యమయ్యింది. చేపలు పట్టటానికిని వెళ్ళిన స్థానికులకు, హోయగే బజార్ బీచ్ సమీపంలో మృతదేహం కనిపించింది. ఆయన మాజీ ముఖ్య మంత్రి ఎస్‌ఎం కృష్ణ అల్లుడు. .

 150 సంవత్సరాలుగా  కాఫీ వ్యాపారం చేస్తున్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన భారతదేశంలోనే పెద్ద కాఫీ చైన్ స్థాపించారు. జెర్మన్ కాఫీ చైన్ యజమాని చిబో నుంచి ప్రేరణ పొందిన ఆయన,  తన మొట్టమొదటి కేఫ్ కాఫీ డే ఔట్ లెట్ 1994లో  బెంగళూరులోని బ్రిగేడ్ రోడ్లో తెరిచారు. 200 నగరాల్లో 1750  దుకాణాలతో భారతదేశం అతి పెద్ద కాఫీ చైనుగా ఆయన సంస్థని తీర్చి దిద్దారు.  
అంత్యక్రియల కోసం ఆయన  పార్థివ దేహాన్ని, ఆయన స్వస్థలమైన చిక్మగళూర్ దగ్గరలోని చీకనహళ్లిలో ఆయన అంత్యక్రియలు జరపటానికి నిశ్చయించినట్టు, ఆయన కుటుంబానికి బాగా దగ్గరైన ఎం‌ఎల్‌ఏ డి‌టి రాజె గౌడ తెలిపారు.  
రాజ్యసభలో వాయిదా తీర్మానం:


సిద్ధార్థ్ మరణానానికి ముందు రాసిన  లేఖలో ఆదాయపుపన్ను అధికారుల వేధించారన్న ఆరోపణపై కాంగ్రెస్స్ చెందిన మనీష్ తివారీ రాజ్యసభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. 
మోడి ప్రభుత్వంలో టాక్స్ టెర్రరిజం ఎక్కువైందని. ప్రభుత్వ అధికారుల వేధింపులు ప్రజలకు ఎక్కువయ్యాయని కాంగ్రెస్స్ విమర్శించింది. 
52 వారాల కనిష్టానికి  స్టాక్:
సిద్ధార్థ్ కనిపించనప్పటినుంచి క్షీణిస్తూ వస్తున్న కేఫ్ కాఫీ డే పడిపోయిన కేఫ్ కాఫీ డే షేరు ధర ఆయన మరణ వార్త తెలియగానే 52 వారాల కనిష్టానికి పడిపోయింది.