:లైంగిక వేధింపుల నుండి కూడా రక్షణ కావాలి - యువరాణి హయ 

లండన్: దుబాయి రాజైన షేక్ మహమ్మద్ బిన్ రాషీద్ అల్-మక్తౌమ్ భార్య బలవంతపు పెళ్లినుంచి  తన ఇద్దరు పిల్లలకు  రక్షణ కల్పించమని ఇంగ్లండ్ కోర్టులో పిటిషన్ వేసింది. 
45 సంవత్సరాల యువరాణి హయ బింట్ అల్- హుస్సైన్  జోర్డాన్ రాజైన హుస్సైన్ కూతురు. బలవంతపు పెళ్లినుండి రక్షణే కాకుండా, లైంగిక వేధింపులనుండి (non-molestation) రక్షణ ఉత్తర్వులు  కూడా
కోరింది. అయితే ఆమె ఎవరి నుండి రక్షణ కోరుతుందని మాత్రం ఇంకా సమాచారం లేదు.  
ఇంగ్లండ్ అండ్ వేల్స్ హై కౌర్టులో వార్డుషిప్ (wardship) అంటే పిల్లల్ని కోర్టు రక్షణలో ఉంచడం కోసం కూడా పిటిషన్ వేసింది
 ఇది ప్రైవేట్ వ్యక్తుల వ్యవహారామంటూ ఈ విషయం మీద తమ అభిప్రాయం చెప్పటానికి దుబాయి  ప్రభుత్వ వర్గాలు నిరాకరించాయి