చర్య తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాల వినతిపత్రం 

బెంగళూరు: దక్షణ కన్నడ జిల్లాలోని, సల్లియా తాలూకాలో ఉన్న కుక్కే సుబ్రమహాణ్యేశ్వర ప్రైవేట్ కళాశాల యాజమాన్యం ఇద్దరు విద్యార్థునుల్ని సస్పెండ్ చేసింది. ఇక్కడ బి‌బి‌ఎం రెండవ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్తునుల మద్యం, సిగరెట్టులతో ఉన్న ఫోటోలు వాట్స్ యాప్  మద్యమంలో వైరల్ అవటం చూసి నిర్ఘాంత పోయిన కళాశాల యాజమాన్యం, తమ విద్యాసంస్థకి అటువంటి పనులు మచ్చ తెస్తాయంటూ వారిని సస్పెండ్ చేసారు. కొంత మండి స్థానిక ఎబివిపి విద్యార్థులు ఈ విషయాన్ని కళాశాల యజమాన్యం దృష్టికి తీసుకు వెళ్లడంతో యజమాన్యం వారిని సస్పెండ్ చేసి, ఎంక్వైరీ వేసింది.  స్థానిక ఎబివిపి విద్యార్థులు ఈ వివాదం మీద చర్య తీసుకోవాలంటూ స్థానిక పోలీసులకు వినతి పత్రం కూడా సమర్పించారు.