హైదరాబాద్‌: చార్మినార్‌లో యునానీ ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టిన వైద్య విద్యార్థుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. ఆయుర్వేద భవన్‌ను ఎర్రగడ్డకు తరలించడాన్ని నిరసిస్తూ యునానీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అయితే, రోడ్డెక్కిన విద్యార్థులను అరెస్టుచేసి బలవంతంగా వాహనం ఎక్కించే క్రమంలో ఓ విద్యార్థిని పట్ల మఫ్టీలో ఉన్న పోలీస్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. కానిస్టేబుళ్లు విద్యార్థుల్ని లాగుతున్నప్పుడు, మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్‌ ఓ యువతిని కాళ్లతో తొక్కి గట్టిగా గోళ్లతో గిచ్చాడు. దీంతో ఆ విద్యార్థిని బాధతో మెలికలు తిరిగింది. నెప్పి  భరించలేక గట్టిగా కేకలు వేసింది.