కార్యకర్తలకు రూ.2లక్షల బీమా
సమస్యలు ప్రతిపక్షాల సృష్టే ...

హైదరాబాద్‌: నెల రోజుల్లోనే 50 లక్షల మంది తెరాస సభ్యత్వం అందజేసి రికార్డు సృష్టించామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సభ్యత్వం తీసుకున్న వారికి రూ.2 లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన రూ.11.21లక్షల ప్రీమియం చెక్కును యునైటెడ్‌ ఇండియా బీమా సంస్థకు అందజేశారు. భవిష్యత్‌లో ఎంతమంది సభ్యత్వం తీసుకున్నా వారికీ బీమా చెల్లిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. కార్యకర్తల శ్రేయస్సే తమ ధ్యేయమన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 

50 లక్షల మందికి సభ్యత్వంస్థానికల సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయోత్సాహంతో  పురపాలక ఎన్నికల్లో ముందుకెళతామని కేటీఆర్‌ అన్నారు. రానున్న పురపాలక ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు.   తమ అధినేత కేసీఆర్ ఆదేశం ప్రకారం పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రస్తుతం దృష్టిపెట్టామని కేటీఆర్‌ తెలిపారు. ప్రతిపక్షాలకు పనిలేక ఏదో ఒక విమర్శ చేస్తుంటారని, వాటినిపట్టించుకొనవసరం లేదన్నారు.