అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటూ వాపోతున్న బాధితుడు 
నిర్మాతలపై కేసు వేస్తా...

ముంబయి: సినిమాలో సన్నివేశం కోసం చెప్పిన ఫోన్‌ నెంబర్‌ నిజంగా బాలీవుడ్‌ తార సన్నీ లియోనీది అనుకుని కొందరు డిల్లీకి చెందిన ఆ నెంబర్‌ వాడుతున్న వ్యక్తికి ఆగకుండా  ఫోన్లు చేస్తున్నారు. బాలీవుడ్‌  సినిమా ‘అర్జున్‌ పటియాలాలో సన్నీ లియోనీ అతిథి పాత్రలో కనిపించారు. ప్రత్యేక గీతంలోనూ మెరిశారు. ఈ నెల 26న విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది. ఈ సినిమాలోని ఓ సీన్‌లో సన్నీ తన ఫోన్‌ నెంబర్‌ను దిల్జీత్‌కు ఇస్తారు. నిజానికి  ఆమె చెప్పిన ఫోన్‌ నెంబరు దిల్లీకి చెందిన 27 ఏళ్ల యువకుడు పునీత్‌ అగర్వాల్‌ది. నిజంగానే అది సన్నీ నెంబర్‌ అనుకోని  జనాలు తెగ కాల్స్‌ చేస్తున్నారట. వీడియో కాల్‌ చేయాలంటూ, అసభ్యకరంగా మాట్లాడుతున్నారని పునీత్‌ మీడియాతో చెప్పారు. ‘అర్జున్‌ పటియాలా’ సినిమా నిర్మాతలపై కేసు నమోదు చేయాలి అనుకుంటున్నట్లు చెప్పారు. రోజుకు 150 ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయని, తనను మానసికంగా వేధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. సాధారణంగా సినిమాలలో చెప్పే,చూపించే  ఫోన్  నెంబర్‌ ప్రమోషన్ కోసమో, వాడకంలో లేనిదానినో ఉపయోగిస్తారు. వాడకంలో