సోనాక్షీ  సెక్స్ క్లినిక్...

నేను స్నేహితుల నుంచే సెక్స్ గురించి ఎక్కువ తెలుసుకున్నా.  మన దేశంలో కుటుంబ సభ్యుల మధ్య శృంగారం గురించి చర్చే జరగదు. నేను కూడా మా నాన్న గారితో అలాంటి విషయాలు మాట్లాడను. అందరు పిల్లలు అంతే.  నా అభిప్రాయంలో తల్లిదండ్రులే చొరవ తీసుకుని పిల్లలతో సెక్స్, ఇతరత్రా సమస్యల గురించి మాట్లాడాలి. అప్పుడే వారికి మంచి అవగాహన ఏర్పడుతుంది. ఇలా కాకుండా వేరే  మార్గాల ద్వారా తెలిస్తే  పిల్లలు చెడిపోతార`ని సొనాక్షిఉపదేశం చేసింది. 

ప్రస్తుతం ఈ బొద్దు గుమ్మ  `ఖాందానీ సఫాఖానా` అనే లేడీ ఓరియెంటెడ్   నటించింది. సినిమా గురించి ఒక్క లైన్ చెప్పగానే తనకు నచ్చిందని, వెంటనే ఒప్పుకున్నని ఆమె చెప్పింది.  ఈ సినిమాలో సొనాక్షి సెక్స్ క్లినిక్‌ని నడిపే మహిళ పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సొనాక్షి హీటెక్కించే మాటలు మాట్లాడుతోంది.  ఇదంతా కేవలం ప్రమోషన్లో భాగమంటున్నారు కొందరు విమర్శకులు.