ముంబయి: బాలీవుడ్‌ దుగ్గజం కరణ్‌ జోహార్‌ ఇటీవల కొందరు బాలీవుడ్‌ ప్రముఖులకు పార్టీ ఇచ్చారు. దీపిక పదుకొణె, రణ్‌బీర్‌ కపూర్‌, విక్కీ కౌశల్‌, అర్జున్‌ కపూర్‌, మలైకా అరోరా, షాహిద్‌ కపూర్‌, దర్శకుడు అయాన్‌ ముఖర్జీ తదితరులు ఈ పార్టీకి హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను కరణ్‌ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. అయితే ఈ వీడియోలో ఉన్నవారిపై శిరోమణి అకాళీదళ్‌ ఎమ్మెల్యే మజీందర్‌ సిర్సా చేసిన ట్వీట్ వివాదాస్పదమయ్యింది. 

‘ బాలీవుడ్‌లో ప్రముఖులు  డ్రగ్స్‌తీసుకుని ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో చూడండి. దీనిని ఖండిస్తున్నాను. దీనిపై వ్యతిరేకంగా గొంతు  విప్పాలనుకుంటున్నాను’ అని షాహిద్‌ కపూర్‌, దీపిక, అర్జున్‌, వరుణ్‌ ధావన్‌, కరణ్‌ తదితరులు పేర్లను జోడించి ఉడ్తా బాలీవుడ్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.

 ఈ   వైరల్‌ ట్వీట్‌ కు స్పందించిన  కాంగ్రెస్‌ నేత మిలింద్‌ దెవోరా కూడా  ట్వీట్‌ చేశారు.
‘ వీడియోలోచూపించినట్లు నా భార్య కూడా ఆ పార్టీలో ఉంది. అక్కడెవ్వరూ డ్రగ్స్‌ తీసుకున్నట్లు కనిపించలేదు. అసత్య ప్రచారాన్ని   ఇక ఆపండి. మీకు తెలియని వాళ్ల పరువు తీయకండి. దీనిపై మీరు మన్నింపు కోరతారనుకొంటున్నాని ’ అంటూ ఘాటుగా  కౌంటరిచ్చారు