వర్షాలు మనిషికి జీవనాధారం. వర్షం పాతం కొంచం తక్కువైతేనే సాగు నీటికి, తాగు నీటికి ఎంతో కష్ట పడవలసి వస్తుంది. పైగా మండుటెండల తరువాత వచ్చే వర్షం ఎంతో హాయి కలిగిస్తుంది. వీటన్నిటీతో పాటు కొన్ని రకాల జబ్బులు కూడా తెస్తుంది. కొంచం జాగ్రత్తగా ఉంటే మనమూ, మన కుటుంబం రక్షణ పొందవచ్చు. 

1.  కోల్డ్ మరియు ఫ్లూ :  ఉష్త్నోగ్రతల్లో వచ్చే పెనుమార్పుల వల్ల మన శరీరంలో ఇమ్మూనిటీ తగ్గి  కోల్డ్, ఫ్లూ రావటానికి ఆస్కారం ఉంది. వీటి నూన్న్ది రక్షించుకోవటానికి, శరీరానికి  పోషక విలువలు కలిగిన ఆహారం అందించాలి. దీని ద్వారా శరీరంలో అంటిబోడీస్ ఉత్పత్తి పెరిగి క్రిముల వల్ల  విడుదలయ్యే టాక్సిన్ నుండి రక్షణ పొందవచ్చు.

2. దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు:

  (a) మలేరియా:  వర్షాకాలం, మలేరియా పర్యాయ పదాలు. వర్షాల వల్ల నీరు నిలువ ఉండి, మలేరియా వ్యాప్తికి కారణమవుతుంది. నీరు నిలువ లేకుండా చేయటం వల్ల, దోమ తెరలు, విండో స్క్రీన్స్ వాడటం ద్వారా, ఈ వ్యాధిని అరికట్ట వచ్చు. 
  (b) డెంగ్యూ: ఈ వ్యాధి నొప్పి కలిగించటమే కాకుండా ప్రాణాంతకం కూడా కావొచ్చు.  డెంగ్యూ వైరస్ వల్ల, ఇది కూడా దోమల ద్వారానే వ్యాప్తి చెందుతుంది. దోమలు కరవకుండా శరీరాన్ని రక్షించుకోవాలి.

3. కలరా:  ఇది వైబ్రియో అనే బాక్తెరియా వల్ల వచ్చే వ్యాధి.  ఇది అన్నవాహిక  మీద ప్రభావం చూపి, డీహైడ్రేషన్. డయేరియా కలిగిస్తుంది. వేడిచేసిన నీరు, శుద్ధి చేసిన నీరు త్రాగటం వల్ల ఈ క్రిములనుండి రక్షించుకోవచ్చు.

3. టైఫోయిడ్:  కౌశితమైన ఆహారం, నీటి వల్ల ఈ జ్వరం వస్తుంది. ఇది కూడా సాల్మోనెల్లా టైఫీ అనే బాక్టీరియా వల్ల వస్తుంది. శుద్ధి చేసిన నీరు తాగి, సరైన శుచి,శుభ్రతలు పాటించటం ద్వారా దీనిని అరికట్టచ్చు.

4.  హెపాటిటీస్ A: ఇదికూడా కలుషితమైన ఆహారం, నీటిని వాడటం వల్ల వస్తుంది. జ్వరం, వాంతులు, రాష్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. సరైన శుభ్రతను పాటించడం ద్వారా ఈ వ్యాధి నుండి రక్షణ పొందవచ్చు.