వందేమాతరం పాడిస్తా...

హైదరాబాద్:  ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీతో ‘భారత మాతకు జై’ కొట్టించటానికి తనకు ఐదు నిమిషాలు టైమ్ చాలని ఎమ్మెల్యే రాజాసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అక్బరుద్దీన్‌ చేసిన వ్యాఖ్యలపై రాజాసింగ్‌ స్పందిస్తూ... ‘పదిహేను నిమిషాల టైమ్‌ ఎప్పుడిస్తా వో.. ఎక్కడ కలుస్తావో నువ్వే చెప్పు.. ఐదు ని మిషాల్లోనే నీతో భారత మాతకు జై కొట్టిస్తా.. వందేమాతరం గీతం పాడిస్తా’ అన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదులో భాగంగా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేటలో జరిగిన ఓ  సభలో ఆయన అన్న ఈ మాటలు సంచలనం రేపుతున్నాయి.