న్యూఢిల్లీ: ఉన్నావ్ మొదట అత్యాచారం, తరువాత రేప్ కేసులో ప్రధాన నిందితుడు, బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఆ పార్టీ షాకిచ్చింది. పార్టీ నుండి  బహిష్కరిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. రేప్ కేసులో బాధితురాలు, అదే కేసులో సాక్షిగా ఉన్న ఆమె బంధువు, ఇతర  కుటుంబ సభ్యులు కలిసి  ప్రయాణిస్తున్న వాహనం మంగళవారం ప్రమాదానికి గురైన ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది.  ఈ విషయం పార్లమెంటును కూడా కుదిపేసింది.  ఈ కేసులో కుల్దీప్‌ ప్రధాన నిందితుడు కావటంతో బి‌జే‌పి ప్రతిష్ఠ మసక బారింది.   దిద్దుబాటు చర్యలకు దిగిన  బీజేపీ పార్టీ  ఆయనపై వేటు వేయక తప్పలేదు. మరోవైపు కుల్దీప్‌తో పాటు మరో 10 మందిపై సీబీఐ బుధవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇదిలా ఉంటే, బాధితురాలి రక్షణలో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. అసలు ఆ సమయంలో పోలీసులు వారితో ఎందుకు లేరని దేశమంతా ప్రశ్నించడంతో, మొదట మామూలు ఆక్సిడెంటే అని కొట్టి పారేసిన ప్రభుత్వం వారి మీద చర్య తీసుకోక తప్పలేదు.