ఎన్‌టి‌ఆర్ పార్టీ వల్లే కాపులకు గుర్తింపు 


అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాపులపై కక్ష కట్టడాని,  ఓటు బ్యాంక్‌గానే వాడుకున్నారని టీడీపీ నేత కళా వెంకట్రావు మండి పడ్డారు. ఏ రోజు  మీడియాతో మాట్లాడుతూ.. కాపుల నోటికాడ కూడు లాగేస్తుంటే.. వైసీపీలో ఉన్న కాపు నేతలు ఏం చేస్తున్నారని విమర్శించారు.  వైసీపీ కాపు నేతలు కాపు సమాజానికి జవాబు చెప్పాలనన్నారు. 
 
రెండు నెలల్లోనే  జగన్‌ ఎన్నో సార్లు మడమ తిప్పారని కళా వెంకట్రావు విమర్శించారు. మ్యానిఫెస్టోలలో పెట్టిన అంశాలను సైతం పట్టించుకోవడం లేదన్నారు. పవిత్రమైన  అసెంబ్లీ తీర్మానం చేసిన అంశాన్ని కూడా జగన్ తీసి పక్కన పెట్టారన్నారు. నిజంగా కాపుల కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశమే అన్నారు.