పొట్లూరి ట్వీట్!


విజయవాడ: వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ ‘‘ఈ మధ్య మార్కెట్లో అన్నీ టైర్లులేని సైకిళ్ళు, స్టీరింగ్ లేని బస్సులే కనిపిస్తున్నాయి. అయితే అందరి ఇళ్లలో చల్లటి గాలి వీస్తున్న ‘ఫ్యాన్’ మాత్రమే పనిచేస్తోంది. ఆంధ్రులకు ఎంత హాయి కదండీ’’ అంటూ ట్వీట్ చేశారు. రాక రకాల్ ట్వీట్లతో  సోషల్ మీడియాలో తన మార్కు నిలుపుకుంటున్న ఆయన  విపక్ష పార్టీపై, సభ్యులపై  చేస్తున్న విమర్శలు బాగానే పేలుతున్నాయి.  తాజాగా పీవీపీ మరో ట్వీట్ చేశారు. టీడీపీ, కేశినేని నానిల పేరెత్తకుండానే వారిని ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.