ఐ‌ఎం‌ఎఫ్ రుణం తరువాత భారీగా పెరిగిన రేట్లు...

ఇస్లామాబాద్: పాక్ పి‌ఎం ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ దేశవ్యాప్తంగా ఈ మధ్య విపరీతంగా పెరిగిన నాన్, రొటీల రేట్లు తగ్గించమని ఉత్తర్వులు జారీ చేశాడు. గత కొద్ది కాలంగా, విదేశీ మారక ద్రవ్య నిలవలు తగ్గిపోవటంతో, పాక్ ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఒకప్పటి మిత్రదేశం అమెరికా, ఇప్పడు జోడీ కట్టిన చైనాలు మొహం చాటేయ్యటంతో, దివాళా స్థితికి చేరుకున్న దేశాన్ని గట్టెక్కించటానికి పాక్ ఐ‌ఎం‌ఎఫ్ దగ్గర 6 బిలియన్ డాలర్ల అప్పు చేయవలసి వచ్చింది.  ఐ‌ఎం‌ఎఫ్ షరతులకు లోబడి ఎన్నో కఠినమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవలసి వచ్చింది. దాంతో గాస్, గోధుమ పిండి  తదితర ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరిగడంతో, 7-8 రూపాయల మధ్యనున్న రోటి, 10-12 రూపాయలు,  అలాగే  8-10 రూపాయల మధ్యనున్న నాన్ 12-15 రూపాయలవ్వడంతో  ప్రజల్లో అలజడి చెలరేగింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వం మీద నిరసన తలెత్తడంతో,  నాన్, రోటీ రేట్లులు  పాత ధరలకే అమ్మాలంటూ ఉత్తర్వులు వెలువడ్డాయి.