ఆహారానికి మతం లేదు ఆహారమే ఒక మతం...

జొమాటో ఆర్డర్ తెచ్చిన యువకుడు హిందువు కానందున ఆర్డర్ తిప్పి పంపిన యువకుడికి పంపించిన సున్నితమైన సమాధానంతో జొమాటో 
లక్షలమంది భారతీయుల మనసులను గెలుచుకుంది. 

అమిత్ శుక్లా అనే యువకుడు నిన్న జొమాటో యాప్ ఉపయోగించి తినడానికి ఆర్డర్ చేశాడు. అయితే ఆ తెచ్చిన డెలివరి బాయి హిందువు కానందువల్ల, ఆయన ఆర్డర్ కాన్సెల్ చేశాడు. ఈ క్రమంలో కంపనీని సంప్రదించగా తాము డెలివరి బోయ్ మార్చలేమని, ఆర్డర్ కూడా కాన్సెల్ చెయ్యలేమని చెప్పగా, తనకు రీఫండ్ ఇవ్వక పోయినా పరవలేదని హిందువుకాని వ్యక్తి తెచ్చిన పదార్థాలు తాను తిననని శుక్ల ట్వీట్ చేశాడు.  దానికి సమాధానంగా జొమాట,  భోజనానికి మతంలేదని భోజనమే ఒక మతమని,  చేసిన ట్వీట్ లక్షలాది మంది లైకులు కొట్టారు. వేలాదిమంది మళ్ళీ ట్వీట్ చేశారు. భిన్నత్వంలో ఏకత్వానికి పెరుకాంచిన మన దేశంలో ఈ మధ్య మతం పేరుతో ఇంత అసహనం పేరుకు పోవటానికి కుళ్లిన రాజకీయ వ్యవస్థతో పాటు అందరి బాధ్యతా ఉంది.  ఇటువంటి విపరీత పోకడలు మొగ్గలోనే అరికట్టక పోతే దేశ సమగ్రతకే భంగం కలగవచ్చు.