స్నేహితుల ద్వారా తెలుసుకొన్న బాధితురాలు...

హైదరాబాద్‌: నమ్మిన స్నేహితురాలి నగ్న చిత్రాలు తీసి వాటిని పోర్న్ సైటులో పెట్టిన ప్రబుద్ధుడి మీద రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలలోకి వెళ్తే...ప్రస్తుతం అమెరికాలో అమెరికాలో ఉంటున్న ఆ నమ్మక ద్రోహి, 9 ఏళ్ల క్రితం  మీర్ పేట్ ప్రాంతానికి చెందిన బాధితురాలతో స్నేహం పేరు చెప్పి దగ్గర అయ్యాడు.  మూడేళ్ళ క్రితం మరింత చేరువయ్యాడు. తరచూ ఫోన్లో మాట్లాడుకుంటూ. కలిసి తిరిగేవారు. ఒక రోజు ఎక్కువగా వెళ్ళే ఒక బేకరీలో మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. అది తాగి మత్తులో ఉన్న ఆ యువతిని ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకొని వెళ్ళి, ఆమె నగ్న చిత్రాలు మొబైల్ ఫోనులో చిత్రీకరించాడు. కొన్ని రోజుల తరువాత ఆ ఫోటోలు చూసిన ఆమె వాటిని తీసివేయమని వేడుకుంది. ఫోటోలు తెసేశానని చెప్పి ఆ మోసగాడు, పై చదువులకోసం అమెరికా వెళ్ళాడు. అక్కడ అనేక నీలి చిత్రాల సైట్లలో అంతా నిక్షిప్తం చేశాడు. స్నేహితుల ద్వారా ఆ విషయం తెలుసుకున్న బాధితురాలు రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో, వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.