ఇంత సైన్యం దేనికి? ఏదో జరగబోతోంది - ఒమర్ అబ్దుల్లా 
అబ్బే అదేంలేదు - కేంద్ర హోమ్ శాఖ 

28,000 మంది సైనికులను లోయలో  ముందే సన్నిద్ధం చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ దళాలను కూడా సిద్ధంగా ఉండమని హెచ్చరించింది. ఈ పరిణామాలని గమనిస్తున్న ఒమర్ అబ్దుల్లా ఇదంతా వింతగా ఉందని, ఇది కేవలం 35A  రాజ్యాంగ అధికరణకు సంబంధించిన విషయమో లేక డెలిమిటేషనుకు సంబంధించిన విషయమో కాదని, దీని వెనక ఇంకో ఏదో రహస్యం దాగుందని అన్నారు. 

రాష్ట్రీయ రైఫెల్స్ మరియు మిగతా గస్తీ దళాలను కూడా సిద్ధంగా ఉంచారు. పాకిస్తాన్ భారత భూభాగంలోనికి తీవ్రవాదులను పంపించటానికి ప్రయత్నం చేయ వచ్చని, ఎలాంటి పరిస్థితినా 
ఎదుర్కోవడానికి సన్నద్ధం చేశారు. వాయుసేన యుద్ధ విమానాలు జమ్ము కాశ్మెర్లో పహరా కాస్తున్నాయి. శ్రీనగర్, లోయలోని ఇతర సున్నిత ప్రాంతాలలో రక్షక దళాలను ఉపయోగిస్తున్నారు. 
    
అమిత్ షా సారథ్యంలోని హోం శాఖ మాత్రం రాష్ట్రంలో శాంతిభద్రతల అంచనాలను బట్టి, ఇతర శిక్షణావసారాలకు మాత్రమే ఈ అదనపు దళాలను వినియోగిస్తున్నామన్నారు.