ఆంధ్రప్రదేశ్ పాలిటి జీవనాడి పోలవరం త్వరగా పూర్తయ్యే అవకాశాలు ఏమాత్రం కనిపించటం లేదు. పోలవరం మీద మొదటినుంచి అవినీతి ఆరోపణలు చేస్తూ వస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం  ప్రాజెక్టుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.  పోలవరం ప్రాజెక్టు విషయంలో బెకం సంస్థను తొలగించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరస్పర అంగీకారం తోనే ఇది జరిగినట్లు జలవనరుల శాఖ తెలియచేసింది. తిరిగి క్రొత్తగా టెండర్లు పిలవనున్నట్లు కూడా వెల్లడించింది.