నీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా?
అమల, సమంతాలతో బిగ్ బాసులో డబ్బు సంపాదించుకోండి...
బిగ్ బాస్ పర్వంలో బూతుల వర్షం

హైదరాబాద్: నాగార్జునా! డబ్బుకోసం  ఏమైనా చేస్తావా? 
నీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? అంటూ హీరో, తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జునపై ప్రముఖ యాంకర్ శ్వేతారెడ్డి అసభ్య పదజాలంతో దూషించారు.  శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా మీట్ నిర్వహించిన ఆమె నాగార్జునను నోటికి వచ్చిన బూతులు తిట్టారు. దమ్ముంటే అమల, సమంతలను దమ్ముంటే బిగ్‌బాస్‌షోకు పంపించందంటూ సవాలు విసిరారు. 
 అమల జంతువుల కోసమే ఎంతో స్పందిస్తున్నప్పుడు ఇంత మంది అమ్మాయిలు ఆరోపణలపై ఎందుకు స్పందిచటంలేదంటూ   ప్రశ్నించారు.  టాస్క్‌ల పేరిట కంటెస్టెంట్‌లను మానసికంగా హింసిస్తున్నారు.  ‘మన్మథుడు -2’ ప్రమోషన్స్‌కు చూపిస్తున్న‌ ఇంట్రస్టులో కొంత భాగమైన  మా ఆరోపణలపై ఎందుకు లేదంటూ దుయ్యబట్టారు.  మా ఉద్యమాన్ని నీటి బుడగ అనడం వింత.  మేం కాదు గాలి బుడగలం, ఉస్మానియా యూనివర్శిటి విద్యార్థులకు నాగార్జుననే ఓ గాలి బుడగ. అమల, సమంతాలతో బిగ్ బాసులో సంపాదించుకోండి.
 
నాగార్జున! తప్పుచేయకుంటే బయటికి వచ్చి స్పందించాలి. ఎందుకు దొంగలాగా దాక్కుంటున్నారు. హౌస్‌లో అందరిని జంతువులుగా బంధించి హింసిస్తున్నారు. మేము బిగ్‌బాస్ హౌస్‌ను ముట్టడిస్తాం. నాగార్జున నువ్వు ఒక ***** నువ్వు డబ్బులకు ఏమైనా చేస్తావా..?. మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా నాగార్జునా!" అన్నారు.

రాయలేని మాటల్లో నాగార్జునను తిట్టిన శ్వేతారెడ్డిపై నాగార్జున,అమల, బిగ్ బాస్ నిర్వహకుల రియాక్షన్ ఎలావుంటుందో మరి