శంషాబాద్‌, ఆగస్టు 2: శంషాబాద్‌ మండలం ముచ్చింతల గ్రామంలో చినజీయర్‌స్వామి దివ్యాసాకేతం ఆశ్రమంలోని దేవాలయాల్లో కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప శుక్రవారం వేకువజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకోసం గురువారం రాత్రే ఆయన ఇక్కడికి చేరుకున్నారు. ఆశ్రమంలోని పరమపదనాథుడు, వైకుంఠనాథుడు, శ్రీరామచంద్రస్వామి దేవాలయాల్లో చిన్న జీయర్ స్వామి ఆద్వర్యంలో యడ్యూరప్ప విశేష పూజలు నిర్వహించారు.  అనంతరం ఆయన విమానంలో బెంగళూరుకు బయలుదేరివెళ్లారు.