అనుకున్నది సాధించిన ట్రంప్...
ప్రతిచర్యలుంటాయి - డ్రాగన్ హెచ్చరిక...

వాషింగ్టన్: ఇప్పటిదాకా అమెరికాకి అతి పెద్ద వాణిజ్య భాగస్వామి అయిన చైనా, ఇప్పుడు వెనక్కి వెళ్ళి పోయింది. పక్క దేశాలైన మెక్సికో, కనడాలకు ఆ ఘనత దక్కింది. వాల్ ష్త్రీట్ జర్నల్ వివరాల ప్రకారం, ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటిదాకా 250 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తుల మీద 25% దిగుమతి సుంకం విధించాడు. ఈ చర్యల వల్ల చైనా దిగుమతులు 12 శాతం తగ్గి, అమెరికా నుండి చేయబడే ఎగుమతులు 19 శాతం తగ్గాయాయి. అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుండి, అమెరికా వాణిజ్య వర్తక విధానాన్ని తమకనుకూలంగా మారుచుకుంటూ వచ్చిన ట్రంప్, సెప్టంబర్ 1 నుండి, 300 బిల్లియన్ డాలర్ల విలువగల చైనా ఉత్పత్తుల మీద ఇంకొక 10 శాతం పన్ను విధించ పోతున్నాడు. అమెరికా చర్యల మీద ఆగ్రహించిన చైనా, తాను కూడా ప్రతిచర్యలకు దిగుతానని హెచ్చరించింది.