పడమరలో మెరిసిన భారత సౌందర్యం  

                                  
లండన్:  ఇక్కడ జరిగిన మిస్ ఇంగ్లాండ్ పోటీల్లో భారత సంతతికి చెందిన బాషాముఖర్జీ విజయం సాధించారు. శుక్రవారం వెలువడిన  వార్తల ప్రకారం,  డర్బిలో నివసించే  23 ఏళ్ల ముఖర్జీ ఇప్పటికే  వైద్య విద్యలో రెండు పట్టాలు సంపాదించింది. అందమెకాదు, తెలివి కూడా నా సొంతం అంటున్న ఈ  సౌందర్యవతి,  ఐదు భాషల్లో మాట్లాడగల పాండిత్యం ఆమె సొత్తు.  వివిధ పోటీలలో పాల్గొని  ఐ.క్యూ 146 గా గుర్తింపు తెచ్చుకున్న మేధావి.