రామజన్మ భూమి ,బాబ్రీ మసీదు వివాదంలో తాము ఏర్పాటుచేసిన ముగ్గురు సభ్యుల కమిటి యిచ్చిన నివేదిక సమగ్రంగా లేదని,అందుకై ఆగష్టు ఆరవ తేదీ నుండి మేమే బహిరంగ విచారణ చేస్తామని సుప్రీమ్ కోర్ట్ తెలియ చేసింది.
 ఎప్పటినుంచో సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న ఈ కేసును ఇక తామే విచారించాలని నిర్ణయించినట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తెలిపింది. జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్‌లు ఈ ధర్మాసనంలో ఇతర సభ్యులుగా ఉన్నారు.