భారత ప్రభుత్వం  చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని కొన్ని సవరణలతో ఆమోదించింది. ఇకపై ఉగ్రవాదుల అణచివేతలో ఈ చట్టం మరింత కఠినమైన చర్యలను చేపట్టనుంది. ప్రభుత్వం శుక్రవారం రాజ్యసభలో చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం–1967 సవరిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు అనుకూలంగా 147 ఓట్లు, వ్యతిరేకంగా 42 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్, బీఎస్‌పీ బిల్లుకు మద్దతు తెలిపాయి.