మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈసారి రాజస్తాన్‌ నుంచి ఆయన్ను రాజ్యసభకు పంపేలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. రాజ్యసభకు జరుగనున్న ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో దిగనున్నట్లు సమాచారం.  ఆయన అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ అధిష్ఠానం నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్టు పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.