25 మందికికిపైగా గాయాలు

ఎల్‌పాసో (అమెరికా): ఉత్తర కాలిఫోర్నియాలో ఓ ఉత్సవంలో కాల్పులు జరిగి ముగ్గురు ప్రాణాలు పోగొట్టుకున్న ఒక వారం లోపే మరొక ఉన్మాది ఘాతుకుకానికి 20 నిండుప్రాణాలు బలైపోయాయి. టెక్సాస్‌ రాష్ట్రంలోని ఎల్‌పాసోలో ఉన్న వాల్‌మార్ట్‌ స్టోర్‌లో, స్కూళ్ళకి సంబంధించిన వస్తువులు కొనటంలో చాలామంది నిమగ్నమై ఉండగా శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత (భారత కాలమానం ప్రకారం) ఓ వ్యక్తి  కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 20 మంది వరకు మరణించారని  టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ మేడియా సమావేశంలో తెలిపారు. కాల్పులకు తెగబడిన వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నాడు.  ఈ కాల్పులతో విద్వేష నేరాలకి సంబంధం ఉండవచ్చని, దుండగుడు పెట్టిన విద్వేషకర పోస్టులు కాల్పుల వెనక గల కారణం తెలుపవచ్చని ఎల్ పాసో పోలీసు చీఫ్ గ్రెగ్ అలెన్ తెలియచేసారు. అయితే ప్రస్తుతానికి ఈ కాల్పుల వెనక కారణం ఉగ్రవాదమా, హేట్ క్రైమా లేక మరొక కారణమా అనేది ఇంకా నిర్ధారించలేదు.