కనకధారా స్తోత్రం సమస్త విజయాలకీ మూలం....

 కనకధారా స్తోత్రం , జగద్గురువులు మన కోసం, మానవజాతి మంచి కోసం మనకిచ్చిన వరం.శ్రావణ మాసం!!ఈ మాసం అనగానే హైందవ సనాతన ధర్మంలో భక్తులకు శ్రీ మంగళ గౌరీ వ్రతం, శ్రీ వరలక్ష్మి వ్రతం గుర్తుకొస్తాయి.మహిళలు అందరు ఈ మాసంలో వచ్చే మూడో శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతం చేసే రోజుగా భావిస్తారు. కుదరని వారు ఈ నెలలో వచ్చే ప్రతి మంగళవారాన్ని శ్రీ మంగళ గౌరీ వ్రతంగాను, ప్రతి శుక్రవారం శ్రీ వరలక్ష్మి వ్రతంగాను అవలంబిస్తారు.ఈ వ్రతాలు చేసిన మహిళలలకు దీర్ఘ సుమంగళత్వం, దీర్ఘాయుష్షు, అష్టైశ్వర్యములు, సుఖ సంతోషములు, వంశాభివృద్ధి కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు . శ్రీ ఆది శంకరాచార్యులవారు తన కనకధారా స్తోత్రంలో శ్రీ లక్ష్మి దేవిని భృగునందన అని కీర్తిస్తారు. దీనిని బట్టి శ్రీ లక్ష్మి భృగు మహర్షి కూతురుగా మనం భావిస్తాం. ఇది అమ్మ మొదటి అవతారం.  ఇక క్షీరసాగర మథనంలో అవతరించిన శ్రీ మహాలక్ష్మి శ్రీ విష్ణుసతిగా తిరిగి రూపు దాల్చింది. తర్వాత శ్రీమహావిష్ణువు భువిపై అవతరించవలసి వచ్చినప్పుడల్లా లక్ష్మి దేవి కూడాఆయనతో పాటుగా అవతరించి లోకకల్యాణం చేయడం జరిగిందని మనకు పురాణాలలో చెప్తారు.

శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం మన ఆచారం. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. ఈ పూజలు ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటకరాష్ట్రాల్లో అధికంగా స్త్రీలు కొలుస్తారు. ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున అమ్మవారిని  పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక ఆది శంకరాచార్యులవారి శ్రీ కనకధారా స్తోత్రానికి ఒక  ప్రత్యేకత ఉంది. ఒక రోజున శ్రీ శంకరాచార్యులవారు భిక్షాటన చేస్తూ, ఒక ఇంటి ముందు ఆగి భిక్ష అడిగారు. ఆ ఇంటి గృహిణి శ్రీ శంకరాచార్యుల వంటి వారు భిక్ష వేయలేనందుకు చింతించింది. వెంటనే ఒక ఉపాయం తోచి ,తమ ఇంట్లో మిగిలిఉన్న ఒకే ఒక ఉసిరి కాయను ఎంతో భక్తి పూర్వకంగా స్వామి వారికి సమర్పించింది. శ్రీ శంకరాచార్యులవారు ఆమె శుద్ధ భక్తికి చలించి పోయారు. వెంటనే శ్రీ లక్ష్మి దేవిని కీర్తిస్తూ ఒక  స్తోత్రం చేశారు . అదే తడవుగా శ్రీ లక్ష్మీదేవి సాక్షాత్కరించి స్వామి వారి ప్రార్ధన మేరకు ఆ భక్తురాలి ఇంట బంగారు ఉసిరికాయలను కురిపించి ఆమె దారిద్ర్యాన్ని పోగొట్టింది. అప్పుడు స్వామి వారు చెప్పిన స్తోత్రమే నేడు మనం పఠించే శ్రీ కనకధారా స్తవము. ఈ స్తోత్రమును ప్రతిరోజు పాటించిన వారికి సకల సంపదలు కలుగుతాయి.

 మహిళలందరూ ఈ శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ప్రతి మంగళ,శుక్ర వారాలలో శ్రీ మహా లక్ష్మిని విధివిధానాలతో, భక్తిశ్రద్ధలతో వ్రతరూపేణా పూజించి సకల సంపదలను పొందగలరు. అమ్మవారి కరుణాకటాక్షవీక్షణాలకు పాత్రులు కాగలరు.

కనకధారా స్తోత్రం:

వందే వందారు మందారం ఇందిరానంద కందలమ్ |
అమందానందసందోహం బంధురం సంధురాననం ||

అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ - - భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ |
అంగీక తాఖిలవిభూతిరపంగలీలా - మాంగళ్యదాస్తు మమ మంగళ్దేవతాయేః || ౧ ||

ముగ్ధా  ముహుర్విదధతీ వదనే మురారేః -ప్రేమత్రపాప్రణీహితాని గతాగతాని |
మాలాదృశ్యోర్మధుకరీవ మహోత్పలేయా - సా మే శ్రియం దిశతు సాగరసంభవాయేః || ౨ || 

విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్షం - ఆనందహేతురధికం మురవిదిిషోzపి |
ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం - ఇందీవరోదరసహోదరమిందిరాయేః || ౩ ||

ఆమీలితాక్షమధిగమయ ముదా ముకుందమానందకందమనిమేషమనంగతంత్రమ్  |
ఆకేకరస్థితకనీనికపక్ష్మనేతం - భూత్యై భవేన్మయ భుజంగశ్యంగనాయేః || ౪ ||

బాహ్వాన్తరే  మధుజితః శ్రరతకౌస్తుభేయ- హారావళీవ హర్వనీలమయీ విభాతి |
కామప్రదా భగవతోzపి కటాక్షమాలా - కళాయణమావహతు మే కమలాలయయేః || ౫ ||

కాలాంబుదాళిలలితోరసకైటభారేః - ధారాధరస్ఫురతి యా తటిదంగనేవ |
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః - భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః || ౬ ||

ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ - మాంగళ్యభాజి మధుమాథిని మన్మమథేన | మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్థం - మందాలసం చ మకరాలయకన్యాకాయాః || ౭ |

దద్యాద్దయా సుపవనో  ద్రవిణాంబుధారామస్మిన్ న కించన  విహంగశిశౌ విషణ్ణే |
దుష్కర్మఘర్మపనీయ చిరాయ దూరం - నారాయణప్రణయినీనయనాంబువాహః || ౮ ||

ఇష్టా విశిష్టమతయోzపి యయా దయార్దృ - దృష్ట్యా త్రివిష్ణపపదం సులభం లభంతే |
దృష్టి: ప్రహృష్ణ కమలోదరదీప్తిరిష్టాం - పుష్టిం కృషీష్ణ మమ పుష్కరవిష్ణరాయా || ౯ ||

గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి - శాకంభరీతి శశిశేఖరవల్లభేతి |
సృష్టిస్థితిప్రళయకీలిషు సంస్థితయై  - తస్యై నమస్తృభువనైక గురోస్తరుణ్యై || ౧౦ ||

శ్రుత్యై  నమోzస్తు శుభకర్మఫలప్రసూత్యై -రత్యై  నమోzస్తు రమణీయగుణార్ణవాయై |
శక్త్యై నమోzస్తు శతపత్రనికేతనాయై - పుష్ట్యై నమోzస్తు పురుషోత్తమవల్లభాయై || ౧౧ ||

నమోzస్తు నాళీకనిభాననాయయ - నమోzస్తు దుగ్దోదధిజన్మభూమ్యై |
నమోzస్తు సోమామృతసోదరాయై  - నమోzస్తు నారాయణవల్లభాయై || ౧౨ ||

నమోzస్తు హేమాంబుజపీఠికాయై - నమోzస్తు భూమండలనాయికాయై |
నమోzస్తు దేవాదిదయాపరయై - నమోzస్తు శార్జ్గాయుధవల్లభాయై || ౧౩ ||

నమోzస్తు దేవ్యై భృగునందనయై - నమోzస్తు విష్ణోరురాసిస్థితయై |
నమోzస్తు ఇలాక్ష్మ్యై  కమలాలయయై- నమోzస్తు దామోదరవల్లభాయై || ౧౪ ||

నమోzస్తు కాంత్యై కమలేక్షణాయై - నమోzస్తు భూత్యై భువనప్రసూత్యై  |
నమోzస్తు దేవాదిభిరార్చితయై- నమోzస్తు నందాత్మజవల్లభాయై || ౧౫ ||

సంప్తకరాణి సకలేంద్రియ నందనాని - సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి|
త్వద్వందనాని దురితాహరణోద్యనాని - మామేవ మాతరనిశ్ం కలయంతు మాన్యే || ౧౬ ||

యత్కటాక్షసముపసనావిధిః - సేవకస్య ససకళార్థసంపద |
సంతనోతి వచనాంగమానసై: - త్వాం మురారిహృదయేశ్వరీం భజే || ౧౭ ||

సరసజనయనే సరోజహసేు- ధవళ్తమాంశ్రకగంధమాలయశోభే |
భగవతి హరివల్లభే మనోజ్ణే -త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ || ౧౮ ||

దిగ్ఘస్తిభీ: కనకకుంభముఖావసృష్ట- స్వర్వాహినీ  విమలచారుజలప్లుతాంగీమ్ |
ప్రాతర్నమామి  జగతాం జననీమశేష - లోకాధినాథగృహిణీమమృతాబ్దిపుత్రిమ్ || ౧౯ ||

కమలే కమలాక్షవల్లభే త్వం  - కరుణాపూరతరంగితైరపాంగై |
అవలోకయ మామకంచనానాం - ప్రథమం పాత్రంకృత్రిమై దయాయాః  || ౨౦ ||

దేవి ప్రసీద జగదీశ్వరి  లోకమాతేః - కళ్యాణదాత్రి కమలేక్షణజీవనాథే |
దారిద్ర్యభీతిహృదయః శరణాగతం మామ్ - ఆలోకయప్రతిదినంసదాయైరాపాంగై: || ౨౧ ||

స్తువంతి యే స్తుతిభిరమీభిరన్వహం - త్రయీమయీం త్రీభువనమాతరం రమామ్ |
గుణాధికా గురుతరభాగ్యభాజినో - భవంతి తే భువి బుధభావితాశయః || ౨౨ ||