మాటలను వెనుకకు తీసుకున్న తమిళ దర్శకుడు రాజుమురగన్‌ ...

చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, విజయ్‌ గురించి నోరు జారానని దర్శకుడు రాజుమురగన్‌ క్షమాపణ కోరారు. జీవా, నటాషా సింగ్‌ జంటగా ఆయన దర్శకత్వం వహించిన సినిమా ‘జిప్సీ’.  ఈ సినిమా ట్రైలర్‌, పాటలకు మంచి స్పందన లభించింది. ఇటీవల జరిగిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో రాజుమురగదాస్‌ రజనీ, విజయ్‌లపై వివాదాస్పద  వ్యాఖ్యలు చేశారు. 

నటులకు సూపర్‌స్టార్‌, దలపతి  అనే రక రకాల టాగులు  ఉంటాయని, మరి అదే సినిమాలో నటించిన నటికి అలాంటి ట్యాగ్‌లు ఎందుకు ఉండవని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై తమిళనాడు అంతటా వారి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శకుడికి వ్యతిరేకంగా నిర్శన వ్యక్తమయ్యింది. సోషల్‌మీడియాలో విమర్శలు ఎక్కువ కావడంతో ఆయన ,  ‘ రజనీ, విజయ్‌ చిత్ర పరిశ్రమలో ఎంతో విజయవంతంగా రాణిస్తున్నారు. తమ శ్రమ, అంకితభావంతో చిత్ర పరిశ్రమకు ఎంతో సేవ చేస్తున్న వారిపై నాకు చాలా గౌరవం ఉంది’ అని ఆయన పేర్కొన్నానని వివరణ ఇచ్చారు. పొరపాటున నోరు జారాను. ఇతరుల మనోభావాలను దెబ్బతీయడం, బాధపెట్టడం నా ఉద్దేశం కాదు. నేను చేసిన వ్యాఖ్యలకు మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నా రాజుమురగదాస్‌ క్షమాపణలు కోరారు.