తన స్వార్థం కోసం వైకాపా పోలవరం అడ్డుకుంటోంది...

అమరావతి: ఎంతో బాగా జరుగుతున్న పోలవరం పనులను  వైకాపా తన స్వార్థం కోసం అడ్డుంటోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు విమర్శించారు. కేంద్రానికి చెప్పకుండా ఏకపక్షంగా పోలవరం టెండర్లు ఎలా రద్దు చేస్తారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ప్రశ్నించారు. రివర్స్‌ టెండర్లకు వెళ్లడం ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అవరోధమేనన్న కేంద్రమంత్రి షెకావత్‌ వ్యాఖ్యలపై వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఇలా చేసుకుంటూ పోతే పోలవరం ఎప్పటికీ పూర్తవుతుందని మండి పడ్డారు. సెర్బియా కేసుపై ఉన్న శ్రద్ధ వైకాపా నేతలకు రాష్ట్రంపై లేదని ఆయన విమర్శించారు.