పారదర్శకంగా పనులు... 
నెల్లూరు: పారదర్శకంగా పనులు చేపట్టి 2021 ఆఖరుకల్లా ఈ బహుళార్ద సాధక ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ చెప్పారు. పోలవరం నిర్మాణ పనులు నవంబర్‌ 1 నుంచి ప్రారంభిస్తామని పోలవరం పనులకు సంబంధించిన టెండర్లు రద్దు చేయడం ద్వారా ప్రాజెక్టు మరింత ఆలస్యమవుతుందన్న విమర్శలపై ఆయన స్పందించారు. ఈ మేరకు నెల్లూరులో శనివారం మీడియాతో మాట్లాడారు. పోలవరంలో దోపిడీ నిర్మూలన కోసమే రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తున్నామని చెప్పారు. ప్రభుత్వ చర్యలతోనే పోలవరం ఆలస్యమవుతోందనడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. సెప్టెంబర్‌ వరకు పోలవరంలో ఎలాంటి పనులూ జరగవని స్పష్టంచేశారు. సెప్టెంబర్‌ నాటికి టెండర్లకు సంబంధించిన వ్యవహారాలను ముగించిన తరువాత కొత్త కాంట్రాక్టర్లు పనులు మొదలు పెడతారన్నారు.