వాల్డ్ కప్ 2019 నుంచి, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ ఇద్దరూ ప్రేక్షకుల నుండి వ్యతిరేక ఎదుర్కొంటూనే వున్నారు. అదే వ్యతిరేకత ఏమాత్రం తగ్గ కుండా ఎడ్గ్ బాస్టన్, ఆగస్ట్ 1న మొదలైన  ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మొదటి యాషెస్ టెస్ట్ మాచ్ సమయంలో కూడా కనిపించింది. స్టేడియంలో కనిపించింత సేపు కూడా కామరాన్ బాంక్రాఫ్ట్, వార్నర్, స్మిత్ ముగ్గురూ స్టేడియంలో ఎప్పుడు కనిపిస్తే అప్పుడు" ఆయన చేతుల్లో శాండ్ పేపర్ ఉంది (he's got sandpaper in his hands)" అని అరుస్తూనే ఉన్నారు. 

శనివారం జరిగిన మాచ్ అప్పుడు, డేవిడ్ వార్నర్, బౌండరీలో ఫీల్డింగ్ కోసం నిలబడ్డాడు. తమకు దగ్గిరలో వార్నర్ కనిపించగానే  "ఆయన చేతుల్లో శాండ్ పేపర్ ఉంది" అంటూ అరుస్తున్న ప్రేక్షకుల గొడవ మరింత ఎక్కువైయ్యింది. అప్పుడు వార్నర్ తన ఖాళీ చేతులు చూపిస్తూ, తరువాత ఫాంట్ రెండు జేబులు  ఖాళీగా ఉన్నట్టు చూపెట్టటంతో స్టేడియం సద్దుమణగటమే కాక, కాసేపు వారిని ఉల్లాస పరిచింది.