ఈశాన్యభారతంలో ఎంతో వివాదాస్పదమైన పౌరుల రిజిస్టర్ వచ్చే సంవత్సరం నుంచి తప్పనిసరి చేయనున్నారు. ఇకపై భారతీయుల్లో ప్రతి ఒక్కరికి రిజిస్టర్డ్ నెంబర్ ఉండబోతుంది. 2020 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్‌ 30వ తేదీల మధ్య ఈ కార్యక్రమం అస్సాం మినహా దేశవ్యాప్తంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా అధికారులు ఇంటింటికీ వెళ్లి ఆ ప్రాంతంలో ఆరు నెలలుగా నివాసం ఉంటున్న లేదా మరో ఆరు నెలలు, అంతకంటే ఎక్కువ కాలం అక్కడే ఉండాలనుకున్న వ్యక్తుల పేర్లను నమోదు చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి.