చట్టప్రకారం విడాకులు తీసుకోవాలన్న దంపతులు ఇకపై విచారణా సమయంలో తమ, తమ సాక్షుల వాంగ్మూలాలను  కోర్టుకు వెళ్లకుండానే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు సమర్పించవచ్చు. తెలంగాణా హై కోర్ట్ ఖమ్మం జిల్లాకు చెందిన ఒక యువతి కేసులో ఈ తీర్పు చెప్పారు. ఒక క్రిమినల్ కేసులోనే సుప్రీమ్ కోర్ట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపినపుడు , సివిల్ కేసుల్లో ఆ పద్దతిని పాటించడం తప్పుకాదని హై కోర్ట్ వ్యాఖ్యానించింది.