అమెరికాను చూసి భయపడేది లేదని ,అవసరమైతే తాము అమెరికాతో యుద్హానికైనా సిద్హమని వెనిజులా అధ్యక్షుడు హెచ్చరించారు. శుక్రవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విలేకరులతో మాట్లాడుతూ వెనెజులా వ్యవహారంలో రష్యా, చైనా, ఇరాన్‌, క్యూబాల జోక్యాన్ని తాము సహించమని, అందుచేతనే ఆ దేశాన్ని దిగ్బంధించే అంశం పరిశీలనలో ఉందని చెప్పారు. బదులుగా నికోలస్ మదురో  అమెరికా బెదిరింపులు చూస్తుంటే ఆ దేశం తీవ్ర నిరాశ, చికాకులు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. తమ దేశానికి వ్యతిరేకంగా అమెరికా ఏ సైనిక చర్య తీసుకున్నా తగిన మూల్యం చెల్లిస్తుందని హెచ్చరించారు. ‘నేర సామ్రాజ్యవాద దేశానికి నేనిచ్చే సందేశం ఇదే. ఎవరైనా మమ్మల్ని ముట్టడిస్తే యుద్ధానికి సిద్ధం కావడానికి మేం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. వారు మాపై ఎంత ఒత్తిడి తెచ్చినా, ఎన్ని ఆంక్షలు విధించినా మేం మరింత స్వేచ్ఛగా, స్వతంత్రంగా వ్యవహరిస్తాం’ అని స్పష్టం చేశారు.