హైదరాబాద్‌: మెగాస్టార్ చిరంజీవి కొత్త లుక్‌లో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో సంచలనాలు సృస్టిస్తున్నాయి. ఈ ఫొటోలను చిరు కోడలు ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఆమె నడుపుతున్న ‘బీ పాజిటివ్‌’ అనే హెల్త్‌  మ్యాగజైన్‌ కవర్‌ పేజీ కోసం చిరు ఫొటోషూట్‌ చేయించారు. ఈ కొత్త లుక్‌లో చిరు కళ్ళు చెదిరేటట్టు మెరిసి పోయారు

 చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’  కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నాడు. అక్టోబరు 2న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు  జరుగుతున్నాయి.